Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ 'IAM GAME' తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్

IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ 'IAM GAME' తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్

Telugu Bell 1 week ago

లయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా చిత్రం 'ఐయామ్ గేమ్'. గతేడాది కాంతతో నిరాశపరిచిన దుల్కర్ రాబోతున్న ఐయామ్ గేమ్ తో భారీ కొట్టాలని చూస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్ చేసారు మేకర్స్. ట్రైలర్ చూస్తే గ్యాంబ్లింగ్, క్రికెట్ స్కామ్ కథాంశంతో అద్భుతమైన విజువల్స్, మైండ్-బ్లోయింగ్ ఛేజింగ్ సీన్లు, హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్సులతో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

తెలుగులో ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తూ దుల్కర్ సల్మాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ImGame ట్రైలర్‌లోని వైబ్ చాలా ఫైరీగా ఉంది. మొదటి నుండి చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా, ఆసక్తికరంగా ఉంది. నా బ్రదర్ దుల్కర్ సల్మాన్ మరోసారి ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని అందించబోతున్నాడని గట్టిగా నమ్ముతున్నాను. ఈ గేమ్ లో తప్పకుండా గెలుస్తాడని ఆశిస్తున్నాను. దుల్కర్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. , దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై జోమ్ వర్గీస్ తో కలిసి భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ్ డైరెక్టర్ కమ్ నటుడు మిస్కిన్, యాంటోని వర్గీస్, కతిర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సౌత్ ఇండియాలో 100కు పైగా లొకేషన్లలో షూట్ చేశారు. ఆగస్టు 20న ఓనం కానుకగా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది ఐయామ్ గేమ్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell