ఇండియన్ సినిమా లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా విషయంలో ఈ కొన్నేళ్లలో పలు కాంట్రవర్సీలు ఏ విధంగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ గా లిస్ట్ లో సూర్య నటించిన కరుప్పు/ వీర భద్రుడు సినిమా కూడా యాడ్ అయ్యింది.
దీనితో మేకర్స్ ఇప్పుడు అధికారిక ప్రెస్ నోట్ ని విడుదల చేసి మ్యాస్ట్రో ఇళయరాజాకు క్షమాపణ చెబుతున్నారు.
అసలు ఇంతకీ ఏమైందంటే సినిమా సెకండాఫ్ లో ఓ సీన్ వద్ద ఇళయరాజాకు సంబంధించి చిన్నపాటి డైలాగ్ ఉంటుంది. అయితే ఆ సందర్భానికి అది అనుచితం కాగా ఇదే వివాదానికి దారి తీసింది. దీనితో మేకర్స్ అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసి తాము సినిమాలో కావాలని ఆ సీన్ పెట్టలేదని రాజా గారి గౌరవ మర్యాదలకి భంగం కలిగించే ఉద్దేశం తమకి లేదు అని క్షమాపణ కోరారు. దీనితో ఈ ప్రెస్ నోట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక దీనిపై ఇళయరాజా స్పందన ఏంటి అనేది కూడా వేచి చూడాలి.
The submit ఇళయరాజాకు 'వీర భద్రుడు' టీం క్షమాపణ.. అసలేం జరిగిందంటే? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
