Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'జాన్వీ' మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారట !

Telugu Bell 3 weeks ago

హీరోయిన్ జాన్వీ కపూర్ తన తాజా ఇంటర్వ్యూలో మద్యం అలవాటు గురించి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఒక పాడ్‌ కాస్ట్‌ లో ఆమె మాట్లాడుతూ.. నా జీవితంలో ఎదురైన ఒక బాధాకరమైన సంఘటన తర్వాత నాకు మద్యం అలవాటు అయింది.

దాని నుంచి బయటకు రావడానికి నేను చాలా కష్టపడ్డాను’ అని తెలిపింది. ఐతే, ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తాజాగా జాన్వీ కపూర్ ఖండించింది.

జాన్వీ మాటలను తప్పుగా వక్రీకరించారని ఆమె టీమ్ ఓ నోట్‌ విడుదల చేశారు. 'జాన్వీకపూర్ పంచుకున్న వ్యక్తిగత అనుభవాల వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని, సందర్భాన్ని పక్కదోవ పట్టించేలా ప్రచారం చేయడం మంచిది కాదు. ఆమె నిజాయితీగా మాట్లాడారు. దయచేసి.. ఆమె చెప్పిన దాన్ని తప్పుగా అర్ధం చేసుకోవద్దు’ అంటూ ఆ నోట్ లో చెప్పుకొచ్చారు. ఈ నోట్‌ ను జాన్వీకపూర్‌ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలను వైరల్ చేయవద్దు’ అంటూ రిక్వెస్ట్ చేశారు.

The put up 'జాన్వీ' మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారట ! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell