Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Jananayagan : కళ్లు చెదిరే రేటుకు 'జననాయగన్' తెలుగు రైట్స్?

Telugu Bell 1 week ago

విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడంతో ఆయన క్రేజ్ ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ పొలిటికల్ సునామీ ప్రభావం ఇప్పుడు బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ముఖ్యమంత్రి హోదాలో విజయ్ నటించిన ఆఖరి చిత్రం కావడం.. ఇకపై ఆయన వెండితెరపై కనిపించరు అనే భావన ఉండటంతో ‘జననాయగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు హక్కుల వ్యాపారం ఇప్పుడు హాట్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో దళపతికి ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుత పొలిటికల్ వేవ్ ని క్యాష్ చేసుకునేందుకు ‘జననాయగన్’ నిర్మాతలు తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా ₹35 కోట్లు కోట్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మన దగ్గర బయ్యర్లు మాత్రం ₹15 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారట.

₹15 నుంచి ₹20 కోట్ల రేంజ్ అయితేనే బయ్యర్లకు సేఫ్ జోన్. అలా కాకుండా నిర్మాతలు అడిగినంత పెట్టి భారీ ధరకు కొనుగోలు చేస్తే మాత్రం కచ్చితంగా పెద్ద రిస్క్ చేసినట్లే. ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో వస్తే తప్ప బయ్యర్లు గట్టెక్కడం కష్టం. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే.. ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ కి అఫీషియల్ రీమేక్ అని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మన తెలుగు ఆడియన్స్ ఇప్పటికే చూసేసిన కథ కావడంతో.. కేవలం దళపతి ఆఖరి చిత్రం అనే ఎమోషన్, ఆయన కొత్త పొలిటికల్ ఇమేజ్ మాత్రమే ఈ సినిమాని థియేటర్లలో నిలబెట్టాలి. మరి ట్రేడ్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ భారీ డీల్ చివరికి ఏ ధరకు క్లోజ్ అవుతుందో చూడాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell