Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Janhvi Kapoor: కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ

Telugu Bell 6 days ago

లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. కెరీర్ ప్రారంభంలో సరైన కథలను ఎంచుకోలేక అక్కడ వరుస ఫ్లాపులను ఎదుర్కొంది.

కానీ, బాలీవుడ్‌లో కాలం కలిసిరాకపోయినా.. సౌత్ ఇండస్ట్రీ, ముఖ్యంగా టాలీవుడ్ మాత్రం జాన్వీకి రెడ్ కార్పెట్ పరిచింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ లక్కీ లేడిగా మారిపోవడమే కాకుండా, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ (తమిళం) ఒక బంపర్ ఆఫర్ దక్కించుకుని పాన్-సౌత్ స్టార్‌గా దూసుకుపోతోంది.

తమిళ సినీ పరిశ్రమ (కోలీవుడ్) నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం.. వర్సటైల్ సీనియర్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) హీరోగా తెరకెక్కబోతున్న ఒక భారీ యాక్షన్ విజువల్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ పాత్ర కోసం మొదట 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, కొన్ని అనివార్య కారణాలు.. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.

దీనితో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న జాన్వీ కపూర్‌ను సంప్రదించగా.. కథ నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనితో ధృవ్ విక్రమ్ సరసన జాన్వీ తమిళ ఎంట్రీ ఖరారైంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. 'దేవర' సక్సెస్ తర్వాత రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం కూడా కనక బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయితే.. టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ నంబర్ వన్ స్థానానికి వెళ్లడం ఖాయం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell