Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!

Telugu Bell 5 days ago

కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, మానసిక వేదనకు సంబంధించిన వార్తలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.

దశాబ్ద కాలంగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో.. తన భార్య ఆర్తి (Aarti) నుండి ఎదుర్కొంటున్న మానసిక క్షోభను, ఆర్థిక ఇబ్బందులను మీడియా ముందు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకోవడం యావత్ సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.

తన పిల్లలను కలవనివ్వకుండా బాడీగార్డ్స్‌ను పెట్టడం దగ్గరి నుండి, తన సొంత కష్టార్జితాన్ని వాడుకోనివ్వకుండా చేసిన ఆంక్షల వరకు ఆయన చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా కన్నీళ్లు రావడం ఖాయం. ఈ క్రమంలోనే విడాకుల సెటిల్‌మెంట్ కోసం ఆర్తి డిమాండ్ చేసిన భారీ భరణం (Alimony) వివరాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.బకోర్టు పరిధిలో ఉన్న ఈ విడాకుల కేసులో.. భర్త జయం రవి నుండి విడిపోవడానికి ఆర్తి పెట్టిన కండిషన్స్ చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ప్రకారం జయం రవి తనకు విడాకులు ఇవ్వాలంటే.. జీవితాంతం తన మెయింటెనెన్స్ కోసం నెలకు రూ. 40 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆర్తి కోర్టులో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నెలకు రూ. 40 లక్షలు అంటే సంవత్సరానికి ఏకంగా రూ. 4.8 కోట్ల రూపాయలు కేవలం భరణం రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

ఈ డిమాండ్‌పై ట్రేడ్ వర్గాలు మరియు నెటిజన్లు జయం రవికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే, జయం రవి సాధారణంగా ఒక సినిమా చేయడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకుంటారు. ప్రస్తుతం ఆయన రెమ్యునరేషన్ రూ. 5 నుండి 6 కోట్ల లోపే ఉంటుంది. ఒకవేళ ఏడాది మొత్తం సినిమాలు చేయకపోతే ఆయన పరిస్థితి ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి కోర్టు ఈ కేసులో జయం రవికి ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలని కోలీవుడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell