Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్‌కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు

Telugu Bell 5 days ago

స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన తాజా బ్లాక్‌బస్టర్ మూవీ 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

సూర్యకు ఒక పక్కా కమర్షియల్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు ఆర్జే బాలాజీ (RJ Balaji).. ఇప్పుడు సూర్య అభిమానులకు మరో అదిరిపోయే 'క్రేజీ సర్ప్రైజ్ గిఫ్ట్' ఇచ్చారు. థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన సూర్య 'సాలిడ్ టైటిల్ కార్డ్' అఫీషియల్ వీడియోను మేకర్స్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

ఈ సినిమాలో సూర్య స్క్రీన్ ఎంట్రీ అప్పుడు వచ్చే సరికొత్త 'టైటిల్ కార్డ్' ఎలివేషన్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించింది. సాధారణంగా ఇలాంటి స్పెషల్ వీడియోలు సినిమా ఓటీటీలోకి వచ్చేటప్పుడు రిలీజ్ చేస్తారు, కానీ ఆర్జే బాలాజీ మాత్రం ఫ్యాన్స్ కోసం ముందే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వదిలి సర్ప్రైజ్ చేశారు.ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తూ ఆర్జే బాలాజీ డిజైన్ చేసిన టైటిల్ కార్డ్ విజువల్స్, దానికి తోడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చాయి. థియేటర్లలో రెస్పాన్స్ చూసిన సూర్య ఫ్యాన్స్.. ఈ టైటిల్ కార్డ్ వీడియోను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయాలని సోషల్ మీడియా వేదికగా దర్శకుడిని డిమాండ్ చేశారు. ఫ్యాన్స్ కోరికను గౌరవిస్తూ, దర్శకుడు ఆర్జే బాలాజీ ఈ అఫీషియల్ వీడియో క్లిప్‌ను ట్విట్టర్, యూట్యూబ్‌లలో విడుదల చేశారు. దీనితో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తుఫానులా వైరల్ అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell