Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'కరుప్పు' రెస్పాన్స్‌పై సూర్య ఎమోషనల్ నోట్..!

Telugu Bell 1 week ago

మిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.

ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌కు చిత్ర యూనిట్ కష్టమే కారణమంటూ సోషల్ మీడియా వేదికగా అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

నిర్మాతలు డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ప్రభులకు ధన్యవాదాలు తెలిపిన సూర్య.. బాబు పుట్టినప్పటికీ సినిమా ఎడిటింగ్ కోసం శ్రమించిన కలైవానన్‌ను అభినందించాడు. అలాగే థియేటర్లలో వైబ్ క్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్, విజువల్స్ అందించిన విష్ణులను ప్రశంసించాడు.

చివరగా దర్శకుడు ఆర్జే బాలాజీని ఉద్దేశిస్తూ.. 'నాకు బ్లాక్‌బస్టర్ ఇస్తానని మాట ఇచ్చావు, అన్నట్లుగానే అందరి ప్రేమను గెలుచుకుంటూ ఆ మాట నిలబెట్టుకున్నావు' అంటూ సూర్య కొనియాడారు.

The put up 'కరుప్పు' రెస్పాన్స్‌పై సూర్య ఎమోషనల్ నోట్..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell