Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు

Telugu Bell 5 days ago

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో వచ్చిన తాజా మాస్ యాక్షన్ డ్రామా 'కరుప్పు'. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

మొదటి వీకెండ్ లో రూ. 147 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా వీకెండ్ తర్వాత వచ్చే మొదటి సోమవారం టెస్ట్‌లో ‘కరుప్పు’ చిత్రం అద్భుతమైన వసూళ్లతో డిస్టింక్షన్ మార్కులతో పాసైంది. తమిళనాడులో ఈ చిత్రం సోమవారం నాడు కూడా డబుల్ డిజిట్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

కేవలం తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సాలిడ్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మరియు కేరళలలో ‘కరుప్పు’ బాక్సాఫీస్ రన్ అద్భుతంగా సాగుతోంది. తెలుగు స్టేట్స్ లో నాలుగు రోజులకు గాను రూ. 15.50 కోట్ల గ్రాస్ రాబట్టగా రూ. 7.94 షేర్ వసూలు చేసింది. అటు కర్ణాటకలో ఫస్ట్ వీకెండ్ నాటికి రూ. 9.91 కోట్ల గ్రాస్ రాబట్టగా సోమవారం రూ. 1.67 కోట్లు రాబట్టి మొత్తంగా రూ. 11.58 కోట్ల గ్రాస్ తో సూపర్ హిట్ గా నిలిచింది. వర్కింగ్ డేస్ లో కూడా వస్తున్న ఈ సాలిడ్ హోల్డ్ చూస్తుంటే ‘కరుప్పు’ చిత్రం తన ఫుల్ రన్‌లో చాలా ఈజీగా రూ. 250 కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సూర్య నటన, కమర్షియల్ ఎలిమెంట్స్ తోడవ్వడంతో ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సూర్య ఫ్యాన్స్‌కు ఇది పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ బ్లాక్‌బస్టర్ అని చెప్పొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell