Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!

Telugu Bell 1 week ago

త కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉన్న సమంత, తన ఆశలన్నీ లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మా ఇంటి బంగారం'పైనే పెట్టుకుంది. 'ఓ బేబీ' వంటి హిట్‌ను అందించిన దర్శకురాలు బి.వి.

నందినీ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా నిన్ననే (మే 14) విడుదల కావాల్సి ఉంది. కానీ చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని జూన్ 19కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మొదట్లో ఈ నిర్ణయంపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. మే నెలలో విడుదల చేస్తే రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద సోలో రన్ దొరికేదని, వాయిదా వేసి మంచి అవకాశాన్ని వదులుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

కానీ ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే సమంత నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య జరుగుతున్న 'పర్సెంటేజ్ వార్' కారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు సినిమాలను బహిష్కరించే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ సమంత సినిమా ఇప్పుడు విడుదలయ్యుంటే, థియేటర్ల బంద్ కారణంగా సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేది. రామ్ చరణ్ 'పెద్ది' వంటి భారీ చిత్రమే ఈ వివాదంలో చిక్కుకున్న తరుణంలో, సమంత సినిమాను జూన్ నెలకి వాయిదా వేయడం వల్ల ఈ రిస్క్ నుంచి తప్పించుకున్నట్లయింది. జూన్ 19 నాటికి ఈ వివాదాలు సద్దుమణిగి, పరిస్థితులు చక్కబడే అవకాశం ఉండటంతో సమంత టీమ్ తీసుకున్నది ఒక 'కాలిక్యులేటెడ్ మూవ్' అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell