Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'మహాకాళి'లో జాయిన్ అయిన బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే..?

Telugu Bell 1 week ago

టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మహాకాళి' ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

'హను-మాన్' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత వస్తున్న ఈ సిరీస్‌తో ప్రశాంత్ వర్మ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

బాలీవుడ్ యంగ్ యాక్టర్ రోహిత్ సరాఫ్ 'మహాకాళి' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్‌ను రోహిత్ సరాఫ్ ఇటీవల పూర్తి చేసుకున్నాడు. సోషియో-ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన నటనతో రోహిత్ ప్రేక్షకులను మెప్పిస్తాడని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ సృష్టించిన ఈ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న 'మహాకాళి'లో సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, భూమి శెట్టి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌కెడి స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్‌కె దుగ్గల్ మరియు రివాజ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

The put up 'మహాకాళి'లో జాయిన్ అయిన బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell