Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మళ్లీ ఫుల్ బిజీ అవుతున్న స్టార్ హీరోయిన్ !

Telugu Bell 2 weeks ago

బాలీవుడ్ హీరోయిన్‌ అలియా భట్‌ 'ఆల్ఫా' సినిమాతో రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాతో పాటు అలియా మరో సినిమా కూడా చేస్తోంది.

రణ్‌బీర్‌ కపూర్, విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'లవ్‌ అండ్‌ వార్‌' సినిమాలో కూడా అలియా నటిస్తోంది. మొత్తానికి వరుస చిత్రాలతో బిజీగా ఉన్న అలియా, ఇప్పుడు 'తుంబాడ్‌ 2' చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. హారర్‌ మైథలాజికల్‌గా ఆదేశ్‌ ప్రసాద్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సోహమ్‌ షా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో అలియా భట్ కూడా నటించబోతుంది. చిత్రబృందం అలియాని ఖరారు చేసిందని తెలిసింది. కాగా ''తుంబాడ్‌ 2' చిత్రంలో అలియా భట్‌ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందని.. నిజానికి ఆమె పాత్ర చిన్నదే అయినా.. సినిమాపై ఆమె కీలకమైన ప్రభావం చూపించబోతుందట. ప్రధానంగా ఆమె పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తోందట. మొత్తమ్మీద అలియా భట్ మళ్లీ సినిమాల్లో ఫుల్ బిజీ అవుతుంది.

The publish మళ్లీ ఫుల్ బిజీ అవుతున్న స్టార్ హీరోయిన్ ! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell