Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Mega 158: డాడీ కోసం పెద్ది!

Telugu Bell 4 days ago

‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా #Mega158 (#ChiruBobby2) చిత్రాన్ని కన్నుల పండువగా ప్రారంభించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రేపు (గురువారం) ఉదయం సరిగ్గా 8 గంటలకు పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. మాస్ నాడి తెలిసిన దర్శకుడు బాబీ, ఈసారి మెగాస్టార్‌ను మునుపెన్నడూ చూడని పవర్ ఫుల్ మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

ఈ మెగా లాంచ్ ఈవెంట్‌కు ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేయనున్నారు. రామ్ చరణ్ రాకతో ఈ వేడుకకు మరింత గ్లామర్, క్రేజ్ రావడం ఖాయం. ముఖ్యంగా తన లేటెస్ట్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది' రగ్గడ్ టచ్‌తో చరణ్ తన ఎలక్ట్రిఫైయింగ్ ప్రెజెన్స్‌తో ఈ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. ఒకే వేదికపై మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌ను చూసే అవకాశం రానుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువలలో ఎక్కడా రాజీ పడకుండా పాన్-ఇండియా రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లను రంగంలోకి దించారు. ఎస్. థమన్ (S Thaman) తన మార్క్ మాస్ బీట్స్‌తో థియేటర్లను దద్దరిల్లించే బాధ్యత తీసుకున్నారు. ‘జైలర్’ ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ తన అద్భుతమైన విజువల్స్‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నారు. అవినాష్ కొల్లా ఈ ప్రాజెక్ట్‌కు గ్రాండ్ సెట్స్, భారీ ఆర్ట్ వర్క్ సమకూర్చనున్నారు. రేపు జరగబోయే పూజా కార్యక్రమాలతో ఈ మెగా ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కనుంది. ఈ ఈవెంట్ నుంచి వచ్చే ఫొటోలు, వీడియోల కోసం సోషల్ మీడియాలో అప్పుడే మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ మొదలుపెట్టేశారు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell