మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చిత్రం 'మెగా158' షూటింగ్ రీసెంట్ గా అధికారికంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి మేకర్స్ 'స్పిరిట్ ఆఫ్ మెగా158' పేరిట సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో చిరంజీవి సినిమా టైటిల్‌ను రివీల్ చేయబోతుండగా దర్శకుడు బాబీ ఆయనను ఆపడం, దానికి చిరంజీవి స్పందిస్తూ.. బాబీ తనను ఆపలేడని, సరైన సమయంలో తానే టైటిల్ లీక్ చేస్తానని సరదాగా అనడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిరు మార్క్ కామిక్ టైమింగ్‌తో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు.
The submit మెగా 158 : కరెక్ట్ టైమ్ లో లీక్ ఇస్తా అంటున్న చిరంజీవి..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
