Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్‌లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!

Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్‌లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!

Telugu Bell 1 week ago

Mega Multistarrer: టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తెరపై కనిపిస్తే అభిమానుల్లోనే కాకుండా, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొంటాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో ఓ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కబోతుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – బాబీ డైరెక్షన్‌లో MEGA 158 సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో చిరు – బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ తర్వాత మరోసారి బాబీ-చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే మరోవైపు కింగ్ నాగార్జున తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని రా కార్తీక్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి, నాగార్జున కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. నిజానికి చిరంజీవి – నాగార్జున మధ్య ఉన్న బంధం ఎలాంటిదో ఇండస్ట్రీ వర్గాలతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా తెలుసు. వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త బయటికి రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్ హిట్ మిషన్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. తనదైన కామెడీ టైమింగ్, కమర్షియల్ టేకింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే అనిల్ రావిపూడి.. ఇద్దరు స్టార్ హీరోలను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ – నందమూరి కల్యాణ్ రామ్‌లతో ఒక క్రేజీ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌ను మేకర్స్ ముందుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు అనిల్ రావిపూడి – చిరంజీవి – నాగార్జున ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే.. చిరంజీవి, నాగార్జున అభిమానులకు ఇది భారీ ట్రీట్‌గా మారే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell