Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెంటల్ మాస్ యాక్షన్ ఎపిసోడ్ లో 'మెగా 158'

మెంటల్ మాస్ యాక్షన్ ఎపిసోడ్ లో 'మెగా 158'

Telugu Bell 2 weeks ago

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కలయికలో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా ఇది కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

పైగా డాకు మహారాజ్ లాంటి క్వాలిటీ ప్రొడెక్టు తర్వాత బాబీ నుంచి సినిమా కావడంతో టాలీవుడ్ ఆడియెన్స్ మరింత ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

ఇలా స్టార్ట్ అయ్యిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకెళుతుంది. కొన్ని రోజులు కితమే పొలాచ్చిలో మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు హైదరాబాద్ లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షూట్ లో ఓ మెంటల్ మాస్ యాక్షన్ ఎపిసోడ్ ని ఫైట్ మాస్టర్స్ రామ్, లక్షణ్ లు డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్ లో ఈ ఎపిసోడ్ ఉంటుందట. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The publish మెంటల్ మాస్ యాక్షన్ ఎపిసోడ్ లో 'మెగా 158' first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell