Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'మిరాయ్ 2' షూటింగ్ స్టార్ట్.. ఎక్కడ జరుగుతుందంటే..?

Telugu Bell 5 days ago

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన 'మిరాయ్' చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి విజయం సాధించింది.

ఇక ఈ సినిమా కథ, గ్రాఫిక్స్ వంటి అంశాలు ప్రేక్షకులను మెప్పించంలో సక్సెస్ అయ్యాయి.

ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ గతంలో వెల్లడించారు. దీంతో ఈ చిత్ర సీక్వెల్‌కు సంబంధించిన షూటింగ్‌ను మేకర్స్ నేటి(మే 19) నుంచి ప్రారంభించారు. ఈ చిత్ర షూటింగ్‌ను వైజాగ్‌లో ప్రారంభించారట చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్ 10 రోజుల పాటు సాగనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

తేజ సజ్జా మరోసారి తన పాత్రలో ఇంప్రెస్ చేసేందుకు రెడీ అవుతుండగా రానా దగ్గుబాటి ఈ సీక్వెల్ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. తొలి భాగంలో నటించిన మంచు మనోజ్ కూడా తన పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించనుంది.

The submit 'మిరాయ్ 2' షూటింగ్ స్టార్ట్.. ఎక్కడ జరుగుతుందంటే..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell