Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Mr. Paintings From House Film Evaluation In Telugu | Ranking

Telugu Bell 1 week ago

విడుదల తేదీ : మే 15, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

టీనటులు : త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా, సత్య కృష్ణన్,హర్ష వర్ధన్,శివాజీ రాజా తదితరులు.

దర్శకుడు : మధుదీప్ చెలికాని
నిర్మాత : అరవింద్ మండెం
సంగీతం : ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు
ఛాయాగ్రహణం : రవికుమార్ వి
కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు

సంబంధిత లింక్స్ : ట్రైలర్

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా వచ్చిన సినిమా 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. కాగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అరవింద్ (త్రిగుణ్) వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ లైఫ్ ను లీడ్ చేయడమే సక్సెస్ అని ఫీల్ అవుతాడు. ఇలాంటి అరవింద్ లైఫ్ లోకి మహి ( పాయల్ రాధాకృష్ణ) వస్తోంది. ఐతే, అరవింద్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే క్రమంలో అతని ఫ్యామిలీ నుంచి, ముఖ్యంగా అతని ఫ్యామిలీ రిలేషన్స్ లో అలాగే అతని వ్యక్తిగత నమ్మకాలలో ఊహించని సవాళ్లు తలెత్తుతాయి. అసలు పెళ్లి తర్వాత అరవింద్ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి ?, మహి ( పాయల్ రాధాకృష్ణ) – అరవింద్ కి మధ్య జరిగిన సంఘర్షణ ఏమిటి ?, చివరికి అరవింద్ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఫ్యామిలీ అండ్ లవ్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ సినిమాలో కొన్ని భావోద్వేగాలు బాగానే ఉన్నాయి. అలాగే ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్‌ కూడా పర్వాలేదు. ఇక ఈ సినిమాలో త్రిగుణ్ పోషించిన ప్రధాన పాత్ర అయిన అరవింద్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన త్రిగుణ్ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. ఇతర పాత్రల్లో నటించిన అనీష్ కురువిల్లా, సత్య కృష్ణన్,హర్ష వర్ధన్,శివాజీ రాజా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఈ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' స్క్రీన్ ప్లే స్లోగా సాగుతూ కొన్ని చోట్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే, సినిమాలో కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

అసలు, ఈ జనరేషన్ లో ఇలాంటి రెగ్యులర్ ఎమోషనల్ డ్రామాను చూడటానికి యూత్ ఆసక్తి చూపిస్తారనేది డౌటే. పైగా ఉన్న కంటెంట్ లో కూడా ఫ్రెష్ నెస్ మిస్ అయ్యింది. అయితే, దర్శకుడు పనితనం కొన్నిసన్నివేశాల్లో ఆకట్టుకునే విధంగా సాగినా, ల్యాగ్ సీన్స్ విషయంలో దర్శకుడు ముందే జాగ్రత్త పడి ఉండాల్సింది. పైగా కథ కథనాల్లో కొత్తదనం లేకపోవడం, సెకండ్ హాఫ్ కూడా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. మొత్తానికి ఈ ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని లవ్ ఎలిమెంట్స్ పర్వాలేదకున్నా.. మొత్తమ్మీద ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయ్యింది.

సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పుకున్నట్టే.. సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు సమకూర్చిన పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాత అరవింద్ మండెం పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకోలేదు. కథాకథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ఆకట్టుకోదు.

123telugu.com Ranking: 2/5

Reviewed through 123telugu Crew

Click on Right here For English Evaluation

The submit సమీక్ష :- 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' - సిల్లీ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell