Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Nandu Unsightly Tale Film Evaluation in Telugu

Telugu Bell 3 days ago

విడుదల తేదీ : మే 22, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

టీనటులు : శ్రీ నందు, అవికా గోర్, రవితేజ మహదాస్యం, శివాజీ రాజా, ప్రగ్య నయన్ తదితరులు

దర్శకుడు : ప్రణవ స్వరూప్
నిర్మాతలు : జె.ఎస్. సుభాషిణి, కొండా లక్ష్మణ్
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
ఛాయాగ్రహణం : శ్రీ సాయి కుమార్ దారా
కూర్పు : మిథున్ సోమ, శ్రీకాంత్ పట్నాయక్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

యాక్టర్ శ్రీ నందు, అవికా గోర్ జంటగా నటించిన లేటెస్ట్ సైకో డ్రామా మూవీ ‘అగ్లీ స్టోరీ’ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

​కథ :

​నేహా (అవికా గోర్) చిన్నప్పుడే అనాథగా మారడంతో ఆమెను మావయ్య నారాయణ రావు (శివాజీ రాజా) పెంచి పెద్ద చేస్తాడు. నేహా చిన్నతనం నుండి గౌతమ్ (రవితేజ మహదాస్యం)ను ప్రాణంగా ప్రేమిస్తుంది. అయితే నారాయణ రావు కొడుకు కార్తీక్ (శ్రీ నందు) తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతుంటాడు. నేహా అంటే కార్తీక్‌కు పిచ్చి ప్రేమ, అబ్సెషన్. కొన్ని పరిస్థితుల కారణంగా నేహా తన ప్రేమను త్యాగం చేసి కార్తీక్‌ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లైన తర్వాత కార్తీక్ పెట్టే మానసిక, శారీరక హింసను నేహా ఎలా ఎదుర్కొంది? ఈ టాక్సిక్ రిలేషన్‌షిప్ నుండి ఆమె ఎలా బయటపడింది? చివరికి ఈ 'అగ్లీ స్టోరీ' ఎలాంటి ముగింపునకు చేరింది? అనేదే మిగతా కథ.

​ప్లస్ పాయింట్స్ :

​ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ శ్రీ నందు నటన. ఒక సైకోటిక్, అబ్సెసివ్ భర్తగా నందు తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని బాడీ లాంగ్వేజ్, కళ్ళల్లో కనిపించే క్రూరత్వం పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి.

​అటు హెల్ప్‌లెస్ వైఫ్ పాత్రలో అవికా గోర్ అద్భుతంగా నటించింది. భయం, బాధ, ఆవేదనను ఆమె పండించిన తీరు మెప్పిస్తుంది. ముఖ్యంగా నందు, అవికా మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా కుదిరాయి.

వైవాహిక జీవితంలో కన్సెంట్ మరియు టాక్సిక్ రిలేషన్స్ అనే బోల్డ్ పాయింట్‌ను టచ్ చేయడంలో దర్శకుడి ప్రయత్నాన్ని అభినందించాలి. సెకండ్ హాఫ్‌లో వచ్చే ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ గ్రిప్పింగ్‌గా సాగుతాయి.

​మైనస్ పాయింట్స్ :

సినిమా మెయిన్ పాయింట్ ఫస్ట్ హాఫ్ లోనే ఎస్టాబ్లిష్ అయినప్పటికీ, దర్శకుడు కథను ముందుకు నడపకుండా అక్కడే తిప్పాడు. భార్యను భర్త వేధించే సీన్లు పదే పదే రావడం వల్ల ఫస్ట్ హాఫ్ చాలా చోట్ల రిపీటెడ్ గా అనిపించి, బోర్ కొట్టిస్తుంది.

హీరోయిన్ అంత సైకో ప్రవర్తనను భరిస్తూ, అంతకుముందే ఎందుకు గట్టిగా రియాక్ట్ అవ్వలేదనే దానికి బలమైన కారణాలు కనిపించవు. కొన్ని కీలక సన్నివేశాల్లో డ్రామా మరీ ఓవర్‌గా అనిపిస్తుంది.

ఒక సైకలాజికల్ డ్రామాలో ఉండాల్సిన సస్పెన్స్ లేదా గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. కథ ప్రిడిక్టబుల్‌గా సాగడం సినిమా గ్రాఫ్‌ను తగ్గించేసింది.

​సాంకేతిక విభాగం :

​దర్శకుడు ప్రణవ స్వరూప్ ఎంచుకున్న బోల్డ్ లైన్ బాగున్నా, దాన్ని పూర్తిస్థాయిలో ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేగా మార్చడంలో ఫెయిల్ అయ్యాడు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని బాగా ఎలివేట్ చేసింది. శ్రీ సాయి కుమార్ దారా సినిమాటోగ్రఫీ డార్క్ థీమ్‌కు తగ్గట్టుగా బాగుంది. ఎడిటింగ్ విషయంలో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

​తీర్పు :

ఓవరాల్ గా చుస్తే, 'అగ్లీ స్టోరీ' ఒక బోల్డ్ సైకలాజికల్ డ్రామాగా పూర్తి స్థాయిలో మెప్పించదు. శ్రీ నందు, అవికా గోర్ ల నటన, సెకండ్ హాఫ్‌లోని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకి ప్లస్. అయితే, వీక్ స్క్రీన్‌ప్లే, ఫస్ట్ హాఫ్‌లో రిపీటెడ్ సీన్స్ మరియు స్లో నరేషన్ సినిమా రిజల్ట్‌ను దెబ్బతీశాయి. బోల్డ్ అండ్ డార్క్ కంటెంట్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో ఒకసారి ట్రై చేయవచ్చు. కానీ రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి ఇది అంతగా నచ్చకపోవచ్చు.

123telugu.com Score: 2.5/5

Reviewed through 123telugu Staff

The submit సమీక్ష : అగ్లీ స్టోరీ - కోర్ పాయింట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ ఆకట్టుకోలేదు first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell