Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

NBK 111 : ముంబైలో బాలయ్య మాస్ గర్జన!

Telugu Bell 2 weeks ago

'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.

బాలయ్య కెరీర్‌లో 111వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ముంబయి నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ భారీ కమర్షియల్ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

కాగా చిత్ర యూనిట్ త్వరలోనే ముంబైలో ఒక లాంగ్‌ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. దీనికోసం ఈ వారంలోనే బాలకృష్ణ ముంబయిలో అడుగు పెట్టనున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన టాకీ సీన్లతో పాటు, హై-వోల్టేజ్ పోరాట యాక్షన్ సీక్వెన్స్‌ కూడా తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ రోల్‌ కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో మంచు మనోజ్ బాలకృష్ణను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. దీనికి తోడు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గోపీచంద్ మలినేని ఎలివేషన్స్ తోడైతే ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పక్కా అని చెప్పొచ్చు. మరోవైపు.. ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో పాటు.. బాలయ్య తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో లైన్‌లో పెట్టారు. వచ్చే నెలలో ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ కానుంది. అన్నట్టు జూన్ 10న బాలయ్య బర్త్ డే గిఫ్ట్‌గా ఎన్బీకె111 టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell