Dailyhunt

NBK112 : బాలయ్య - కొరటాలశివ సినిమాకు అనిరుధ్ సంగీతం?

Telugu Bell 2 weeks ago

నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం NBK112. అనౌన్సమెంట్ నుండే ఈ సినిమాపై అంచనాలు క్రేజీగా ఉన్నాయి.

బాలయ్య ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ సీఎం పాత్రలో కనిపిస్తారనే వార్త ఇప్పటికే హల్చల్ చేస్తోండగా తాజాగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారట. ఈ వార్త బయటకు రావడంతో అటు నందమూరి అభిమానుల్లో ఇటు మ్యూజిక్ లవర్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి.

సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు గత కొంతకాలంగా ఎస్.ఎస్. తమన్ ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉంటూ వస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అన్ని మూవీస్ సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేశాయి. అయితే కొరటాల శివ ఈసారి కొత్తగా ట్రై చేయాలని భావిస్తున్నారట. ఇటీవల కొరటాల దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ చిత్రానికి అనిరుధ్ అందించిన సంగీతం గ్లోబల్ లెవల్‌లో హిట్ అయ్యింది. అదే మ్యాజిక్‌ను బాలయ్య సినిమా కోసం కూడా రిపీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ గత సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌తో పని చేయగా దేవరతో అనిరుధ్‌తో సింక్ అయ్యారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా కోసం కూడా అనిరుధ్‌నే ఫైనల్ చేసే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే బాలయ్య మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు అనిరుధ్ ఇచ్చే ఎలక్ట్రిఫైయింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సుధాకర్ చెరుకూరి (శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్) మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి మే 7 నుంచి కీలక షెడ్యూల్స్ ప్రారంభం కానున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell