Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Newton's 3rd Legislation: 'న్యూటన్స్‌ థర్డ్‌ లా' మూవీ రివ్యూ..

Newton's 3rd Legislation: 'న్యూటన్స్‌ థర్డ్‌ లా' మూవీ రివ్యూ..

Telugu Bell 1 week ago

Newton's 3rd Legislation: కొంత గ్యాప్ తరువాత ఇటీవల వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుమంత్. ఆయన లీడ్ రోల్‌లో, టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించిన లేటెస్ట్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'న్యూటన్స్‌ థర్డ్‌ లా'.

హరీష్ నిర్మాణంలో రాజేశ్ కర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ వైపు న్యూటన్స్‌ థర్డ్‌ లా, మరోవైపు ఊహించని మలుపులతో సాగే ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో. ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

న్యూటన్స్‌ థర్డ్‌ లా కథ:

2026లో డేవిడ్ (అవసరాల శ్రీనివాస్) అనే వ్యక్తికి 'న్యూటన్స్ థర్డ్ లా' అనే పుస్తకం పార్సల్‌ వస్తుంది. ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించాక, అందులోని సంఘటనలు 1999లో జరిగిన తన గతానికి సంబంధించినవని గ్రహిస్తాడు.
ఆ పుస్తకంలో… కూతురితో ప్రయాణిస్తున్న జ్యోతి (నేహా పఠాన్) ప్రమాదవశాత్తూ మరణిస్తుంది. సరిగ్గా అదే సమయంలో వినయ్ (త్రినాథ్ వర్మ) బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కేసును విచారించే బాధ్యత వాసుదేవ్ (సుమంత్) అనే పోలీస్ అధికారికి అప్పగిస్తారు. పోస్ట్‌మార్టం నివేదికలో వినయ్ తలలో బుల్లెట్ ఉందనే విషయం వెలుగులోకి రావడంతో, ఇది సూసైడ్ కాదని, పక్కా ప్లాన్డ్ మర్డర్ అని వాసుదేవ్‌కి అర్థమవుతుంది. ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసే క్రమంలో వినయ్ తల్లిదండ్రులు ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నారనే అనుమానం వస్తుంది. మరోవైపు వినయ్ స్నేహితుడు కార్తీక్ (గౌతమ్ పండిట్) అకస్మాత్తుగా మాయమవుతాడు. అసలు వినయ్ హత్యకు, జ్యోతి యాక్సిడెంట్‌కు ఉన్న లింక్ ఏంటి? ఈ కథలో స్టీఫెన్ మెర్క్యురీ (జగపతిబాబు) పాత్ర ఏమిటి? యాక్షన్ కి సమానమైన రియాక్షన్ ఉంటుందనే 'న్యూటన్స్ థర్డ్ లా' వీరి జీవితాలకు ఎలా వర్తించిందనేది మనం బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:

కథను 2026లో మొదలుపెట్టి, పుస్తకం ద్వారా 1999నాటి గతాన్ని చూపించే స్క్రీన్‌ప్లే కొంత రెగ్యులర్ అనిపించినా ఎంగేజింగ్ గా రాసుకున్నాడు డైరెక్టర్. ప్రారంభంలోనే యాక్సిడెంట్, మర్డర్ అంటూ కథపై మంచి ఆసక్తి ఏర్పడుతుంది. వాసుదేవ్ పాత్ర ద్వారా సాగే విచారణ ఫస్ట్ హాఫ్ లో ఆసక్తిగా నడుస్తాయి. అయితే, కీలకమైన ట్విస్టులను రివీల్ చేయకుండా కేవలం ప్రశ్నలతోనే ఫస్ట్ హాఫ్ ముగించడం కొంత లాగ్ ఫీలింగ్ కలిగిస్తుంది.
సెకండ్ హాఫ్ లో వినయ్, కార్తీక్ ఫ్లాష్‌బ్యాక్ ద్వారా అసలు నేరాన్ని విప్పే ప్రయత్నం చేశారు. కానీ సెకండ్ హాఫ్ లో సాగతీత కాస్త ఎక్కువ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో అన్ని ట్విస్టులను ఒకేసారి వెంటవెంటనే చూపించడం వల్ల ప్రేక్షకులు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశముంది. అలాగే 1999 నాటి కాలానికి తగ్గట్లుగా వాతావరణం, ఆర్ట్ వర్క్ లో కొన్ని చిన్న చిన్న లోపాలు కనిపిస్తాయి. అయితే "తల్లిదండ్రుల ప్రవర్తన సరిగ్గా లేకపోతే పిల్లలు ఎలా దారి తప్పుతారు" అనే మెసేజ్ ఒకటి బాగా సెట్ చేశారు.

నటీనటుల విషయానికి వస్తే సుమంత్ పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్‌గా చాలా సెటిల్డ్ అండ్ పరిణతి చెందిన నటనను కనబరిచారు. త్రినాథ్ వర్మ వినయ్ పాత్రలో తన నటనతో అలరించారు. గౌతమ్ పండిట్ కార్తీక్ పాత్రలో ఒదిగిపోయి ప్రశంసనీయమైన ప్రదర్శన ఇచ్చారు..షెల్లీ కుమార్ & నేహా పఠాన్ తమ పరిధి మేరకు మెప్పించారు. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రలు ఉన్నంతలో కథకు బలాన్నిచ్చాయి.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే రొటీన్ క్రైమ్ కథే అయినప్పటికీ, రాజేశ్ కర్ణ స్క్రీన్‌ప్లే అల్లిక పరంగా పర్వాలేదనిపించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ మూడ్‌కి తగ్గట్లుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం థ్రిల్లింగ్ ఫీల్‌ను పెంచగా, పాటల విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించాల్సి ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లకు, అలాగే ఒక పాటకూ కత్తెర వేసి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది. ఈటీవీ విన్ సమర్పణలో నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా రిచ్‌గా ఉన్నాయి.

ఫైనల్లీ.. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు 'న్యూటన్స్‌ థర్డ్‌ లా' నచ్చుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell