Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే 'డబుల్ ధమాకా'.. 'డ్రాగన్' గ్లింప్స్.. ఇంకా..!

Telugu Bell 1 week ago

మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే డబుల్ ధమాకా అప్‌డేట్స్ సిద్ధమయ్యాయి.

సోషల్ మీడియాలో , ట్రేడ్ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ బర్త్‌డే వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాన్స్‌కు రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్‌లో రెండు భారీ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అనౌన్స్‌మెంట్స్ రాబోతున్నాయి.

సంచలనాల దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘డ్రాగన్’ (DRAGON) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్/టీజర్ కట్ ఇప్పటికే పూర్తయింది. సెన్సార్ బోర్డులో ‘గ్లింప్స్ ఆఫ్ డ్రాగన్’ పేరుతో సర్టిఫికేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే, అందరినీ విస్తుపోయేలా చేస్తూ ఈ గ్లింప్స్ రన్ టైమ్ ఏకంగా 4 నిమిషాల 35 సెకన్లు ఉండబోతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సినిమా గ్లింప్స్ లేదా టీజర్ ఈ స్థాయి నిడివితో రావడం బహుశా ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రశాంత్ నీల్ మార్క్ భారీ యాక్షన్ ఎలివేషన్స్, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ వీడియో అభిమానులకు పక్కా ఐ-ఫీస్ట్‌లా ఉండబోతోంది. దానికి సంబంధించిన పనుల్లోనే దర్శకుడు నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక డబుల్ ధమాకాలో భాగంగా రెండవ సర్ప్రైజ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఉండబోతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత’ భారీ విజయం సాధించడంతో, ఈసారి మైథలాజికల్ (పౌరాణిక) టచ్ ఉన్న ఒక భారీ సోషియో-ఫాంటసీ కథతో రాబోతున్నారు. ఈ చిత్రానికి ‘God of Warfare’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పుట్టినరోజునే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియో లేదా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే రోజు టాలీవుడ్ ఇద్దరు టాప్ డైరెక్టర్ల నుండి రాబోతున్న ఈ అప్‌డేట్స్‌తో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell