రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఐతే, ఈ సినిమాలో ఓ స్పెషల్ ఎపిసోడ్ కోసం రవితేజ ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో రవితేజ ఓల్డ్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని టాక్. అన్నట్టు ఈ సినిమా రవితేజ అభిమానులను కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తోందని.. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని శివ నిర్వాణ రవితేజ పాత్రను ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాడట.
ఇక 'కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా'' అని రవితేజ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది.
The submit ఓల్డ్ గెటప్ లో కనిపించబోతున్న రవితేజ ! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
