Dailyhunt

ఓల్డ్ లుక్ లో 'కొరియన్‌ కనకరాజు' ?

Telugu Bell 2 weeks ago

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కొరియన్‌ కనకరాజు' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది.

ఈ సినిమాలో ఓ స్పెషల్ ఎపిసోడ్ కోసం వరుణ్ తేజ్ ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో వరుణ్ తేజ్ ఓల్డ్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని టాక్.

అన్నట్టు, ఈ సినిమాలో వరుణ్‌ తేజ్ కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆ మధ్య విడుదలైన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ 'నేను తిరిగొచ్చేశా' అంటూ కొరియన్‌ భాషలో చెప్పడం ఆకట్టుకుంది. ఇంతకీ, ఈ సినిమాకి కొరియన్ భాషకు ఏమిటి సంబంధం అనేది ? సినిమాలో చాలా ఆసక్తిగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తోందో చూడాలి.

The put up ఓల్డ్ లుక్ లో 'కొరియన్‌ కనకరాజు' ? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell