పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చి రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాను ఎంతో ఆసక్తిగా ఉన్న సెన్సేషనల్ సీక్వెల్ సినిమా 'ఓజి 2' తొందరలోనే మొదలు పెట్టనుండగా ఈ సినిమా మొదలయ్యే గ్యాప్ లోనే తన వీరాభిమానుల్లో ఒకరైన 17 ఏళ్ల చిన్న కుర్రాడు నిరంజన్ కన్ను మూయడం అనేది పవన్ ని ఎంతో వేదనకి గురి చేసింది.
తన ఓజి 2 సినిమాకి గెస్ట్ నువ్వే అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రామిస్ ని సంగీత దర్శకుడు థమన్ రివీల్ చేసాడు. తన సోషల్ మీడియాలో నిరంజన్ మరణం పట్ల చింతిస్తూ నీ ఆత్మకి శాంతి చేకూరాలి నిరంజన్ మా ఆల్బమ్ ని నీకు అంకితం చేస్తున్నాము.. మన లీడర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అంటూ పోస్ట్ చేసాడు. దీనితో నిరంజన్ కి పవన్ తరపున ఇదొక నివాళిగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ విషాద వార్తతో అభిమానులు పవన్, థమన్ లు ఎంతో అప్సెట్ అయ్యారు.
The publish పవన్ చెప్పారు.. 'ఓజి 2' ఆల్బమ్ నిరంజన్ కు అంకితం! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

