ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దైవ సమానంగా భావించి పూజించే నిర్మాత బండ్ల గణేష్. తనకు 'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన పవన్ కళ్యాణ్ పట్ల బండ్ల గణేష్ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారు.
తాజాగా పవన్ పై బండ్ల గణేష్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “మీరంటే నాకిష్టం ఎంతంటే… గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు, కానీ మీ మీదున్న అభిమానం మాత్రం ఆగదు. ఆఖరికి, నా పేరు నేను మర్చిపోయినా మిమ్మల్ని మర్చిపోను.
మీరంటే చచ్చేంత ఇష్టం కాదు… చచ్చాక కూడా నా గుండెల్లో నిలిచిపోయే ఇష్టం” అంటూ బండ్ల గణేష్ రాసుకొచ్చాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్‌పై తనకున్న అపారమైన ప్రేమను బండ్ల గణేష్ మరోసారి బయట పెట్టారు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నూతన చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కడికి బండ్ల గణేష్ కూడా విచ్చేశారు. ఈ సందర్బంగా బండ్ల గణేష్ భుజంపై చేయి వేసిన పవన్ ఆయనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.
The publish పవన్ పై బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్ ! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
