Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పెద్ది : అందరి చూపులు అక్కడే..!

Telugu Bell 3 weeks ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా రావడానికి రెడీ అయింది.

ఇప్పటికే ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు, నేటి ప్రీమియర్ షోల కలెక్షన్లతో మొదటి రోజు నిర్మాతలకు భారీ వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

రామ్ చరణ్ గత చిత్రం 'గేమ్ ఛేంజర్' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, 'RRR' స్టార్‌గా ఆయన పాన్-ఇండియా ఇమేజ్‌ను నిలబెట్టుకోవడానికి ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. సాధారణంగా స్పోర్ట్స్ సినిమాల్లోని ఎమోషన్ నార్త్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. దానికి తోడు హీరోయిన్ జాన్వీ కపూర్ క్రేజ్, ఏఆర్ రెహమాన్ సంగీతం అక్కడ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు కానున్నాయి.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో జగపతి బాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు కీలక పాత్రలు పోషించారు. మరి రేపటి నుండి థియేటర్లలో సందడి చేయనున్న ‘పెద్ది’ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

The submit పెద్ది : అందరి చూపులు అక్కడే..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell