Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'పెద్ది' భోపాల్ ఈవెంట్ కోసం భారీ బడ్జెట్..?

Telugu Bell 5 days ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' చిత్రం జూన్ 4న విడుదల కానుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మే 23న భోపాల్‌లోని బీహెచ్‌ఈఎల్ దసరా గ్రౌండ్స్‌లో భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ వేడుకలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు.

ఈ కాన్సర్ట్ కోసం దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా ముంబై నుండి రూ.150 కోట్ల విలువైన అత్యాధునిక మ్యూజిక్ ఎక్విప్‌మెంట్‌ను రప్పిస్తున్నారు. దీని అద్దె కోసమే మేకర్స్ రూ.1 కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. యూవీ మీడియా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో ఒక స్పెషల్ సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకను చూడాలనుకునే వారి కోసం రేపటి నుండి వేదిక వద్ద ఉచిత పాస్‌లు పంపిణీ చేయనున్నారు.

The submit 'పెద్ది' భోపాల్ ఈవెంట్ కోసం భారీ బడ్జెట్..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell