Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'పెద్ది' ఫుల్ ఆల్బమ్ డిజప్పాయింట్ చేసిందా?

Telugu Bell 2 weeks ago

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్, స్పోర్ట్స్ చిత్రమే 'పెద్ది'.

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ జరుపుకుంటూ వస్తున్న ఈ చిత్రం నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టోటల్ ఆల్బమ్ పెద్ది జ్యూక్ బాక్స్ ని విడుదల చేశారు.

తెలుగు సహా ఇతర భాషల్లో కూడా వచ్చేసింది. మెయిన్ గా చాలామంది పెద్ది మాస్ సాంగ్ మస్సా మస్సా కోసం ఎదురు చూసారు. అయితే ఈ సాంగ్ తో పాటుగా ఇదే టోటల్ ఆల్బమ్ తో ఇప్పుడు వరకు వినని పాటలు కూడా కొత్తవి ఏమన్నా పొందుపరుస్తారేమో అని కూడా చాలా మంది ఆశించారు.

కానీ వారిని మాత్రం మేకర్స్ డిజప్పాయింట్ చేశారనే చెప్పాలి. సుమారు 3 గంటల సినిమాలో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉండడంతో మ్యూజిక్ లవర్స్, మెయిన్ గా ఏ ఆర్ రెహమాన్ నుంచి ఇంకా ఎక్కువ పాటలు ఆశించారు. సో ఆ కోణంలో మాత్రం చాలామందిని పెద్ది ఆల్బమ్ డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి.

The publish 'పెద్ది' ఫుల్ ఆల్బమ్ డిజప్పాయింట్ చేసిందా? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell