Dailyhunt

'పెద్ది' కథ జరిగే సమయం రివీల్.. 24 భారీ సెట్స్ తో 'రంగస్థలం'ని మించి

Telugu Bell 1 week ago

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఉన్న ఐకానిక్ హిట్ చిత్రాల్లో దర్శకుడు సుకుమార్ తో చేసిన సినిమా రంగస్థలం సెట్ చేసిన ఇంపాక్ట్ ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు.

మళ్ళీ ఆ సినిమా తరహాలోనే మంచి హైప్ ని సెట్ చేసుకొని వస్తున్న సినిమానే పెద్ది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ భారీ సినిమాకి రంగస్థలం సినిమాని మించి వర్క్స్ చేసినట్టు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల రివీల్ చేశారు.

అయితే రంగస్థలం సినిమా 1980 దశకం బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని అందరికీ తెలిసిందే. పెద్ది కూడా ఇంచు మించు అదే కాలమానం 1970, 80 లలో జరిగే కథ అని రివీల్ చేశారు. కాకపోతే ఈ సినిమా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొనసాగుతుంది. అయితే గతంలో రంగస్థలం సినిమాకి రంగస్థలం అనే ఊరునే భారీ సెట్టింగ్ వేస్తే అంతా ఆహా అనుకున్నారు కానీ పెద్ది సినిమా కోసం ఏకంగా 24 సెట్స్ వేసి సినిమాకి లైఫ్ తీసుకొచ్చినట్టు అవినాష్ తెలిపారు. సో ఈ సినిమాలో ట్రీట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు.

The put up 'పెద్ది' కథ జరిగే సమయం రివీల్.. 24 భారీ సెట్స్ తో 'రంగస్థలం'ని మించి first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell