Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Peddi: కథే 'పెద్ది'కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..

Telugu Bell 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'పెద్ది'. 'ఉప్పెన' వంటి సెన్సేషనల్ హిట్‌తో టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బుచ్చిబాబు సన, తన రెండో చిత్రంతోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ సినిమా కథ గురించి డైరెక్టర్ స్పందిస్తూ చరణ్ తో తన ప్రయాణాన్ని పంచుకున్నారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబు సన మాట్లాడుతూ.. 'నేను ఒక మంచి కథ రాసుకుని వెళ్లాను.. అది వినగానే రామ్ చరణ్ సార్ వెంటనే ఇంప్రెస్ అయి సినిమా చేయడానికి ఒప్పేసుకున్నారు' అంటూ చెప్పుకొచ్చారు. చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ కథను బుచ్చిబాబు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చరణ్ లాంటి స్టార్ హీరో కథను నమ్మి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినిమా అవుట్‌పుట్‌పై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. అంతే కాదు ఈ ట్వీట్ ద్యారా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మరోసారి స్పష్టం చేసింది. "Complete Power Out as of late" అంటూ మేకర్స్ నేటి నుండి ప్రమోషన్ల హోరును మరింత పెంచబోతున్నట్లు హింట్ ఇచ్చారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell