Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'పెద్ది' కోసం బాలయ్య? ఛాన్స్ ఉందా అసలు!

Telugu Bell 2 days ago

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే 'పెద్ది'. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ ఒకొక్కటిగా జరుగుతూ వస్తున్నాయి.

అయితే లేటెస్ట్ గా పెద్ది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి కొన్ని క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ జూన్ 2న గ్రాండ్ ఈవెంట్ ని మేకర్స్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తుండగా దీనికి నటసింహం బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా వస్తారని టాక్ ఇప్పుడు మొదలైంది. కానీ ఇందుకు అసలు ఛాన్స్ ఉందా? అనే ప్రశ్న కూడా వస్తుంది. బాలయ్యకి రామ్ చరణ్ కి ఎంతో ప్రత్యేకమైన బాండింగ్ ఉంది.

వస్తే కేవలం ఈ కారణంతో రావాలి తప్పితే ఇంతకు మించిన బలమైన కారణం మరొకటి లేదు. లేదా తన వీర సింహా రెడ్డి, పెద్ది ఇప్పుడు తన 111వ సినిమా చేస్తున్న నిర్మాణ సంస్థలు మైత్రి, వృద్ధి సినిమాస్ కోసం రావాలి. సో ప్రస్తుతానికి ఈ క్రేజీ స్టెప్ కి సంబంధించి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

The publish 'పెద్ది' కోసం బాలయ్య? ఛాన్స్ ఉందా అసలు! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell