మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతోంది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుండగా, జూన్ 3నే ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఈ నెల 18 నుంచి ‘పవర్‌ప్లే టూర్’ ప్రారంభం కానుంది. అలాగే, చిత్ర యూనిట్ ముంబైలో ఒక భారీ ఈవెంట్ నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న జాన్వీ కపూర్, తన పాత్రకు స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెపుతుండటం విశేషం. ఆమె కెరీర్‌లో తెలుగులో సొంతంగా వాయిస్ ఇస్తుండటం ఇదే తొలిసారి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో యాస చాలా ముఖ్యం. ఆ స్లాంగ్‌ను పక్కాగా పలికించడం సవాలుతో కూడుకున్న పని అయినప్పటికీ, పాత్రలో సహజత్వం కోసం జాన్వీ ఈ సవాలును స్వీకరించి డబ్బింగ్ పూర్తి చేస్తోంది.
వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథలో చాలా కీలకంగా ఉండబోతోంది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్, బుచ్చిబాబు టేకింగ్, మరియు మొదటిసారి వెండితెరపై మెరవబోతున్న చరణ్ – జాన్వీల ఫ్రెష్ పెయిరింగ్ చూడటానికి ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The publish పెద్ది కోసం జాన్వీ నెవర్ బిఫోర్ ఫీట్.. ఆమే సొంతంగా..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
