టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి చూపులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' పైనే ఉన్నాయి. ఈ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ మరోసారి ఊపిరి పీల్చుకుంటుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు.
గతకొంత కాలంగా టాలీవుడ్‌లో నెలకొన్న సైలెన్స్‌ను పెద్ది బ్రేక్ చేస్తాడని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ మూవీలోని స్పెషల్ ఐటెం సాంగ్‌గా రాబోతున్న 'హెల్లల్లలో' అనే పాటను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ క్లూ ఇచ్చారు.
ఇక ఈ పాటను అనంత్ శ్రీరామ్ రచించినట్లు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే వెల్లడించగా.. ఈ పాటలో రామ్ చరణ్‌తో పాటు స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ డ్యాన్స్‌తో ఇరగదీయబోతుంది. ఈ కాంబినేషన్‌ను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సాంగ్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.
The put up 'పెద్ది' నుంచి నెక్స్ట్ వచ్చేది 'స్పెషల్' ట్రీట్..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
