Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Peddi OTT Spouse: 'పెద్ది' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Telugu Bell 2 weeks ago

Peddi OTT Spouse: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా..

థియేట్రికల్ రన్ కంటే ముందే డిజిటల్ బిజినెస్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య గట్టి పోటీ జరగగా.. చివరికి క్రేజీ డీల్ క్లోజ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. 'పెద్ది' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది.

రామ్ చరణ్‌కు ఉన్న అంతర్జాతీయ క్రేజ్ దృష్ట్యా, నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటు చెల్లించి మరీ సౌత్ అండ్ నార్త్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్‌ను లాక్ చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా పెద్ద సినిమాలకు ఉండే 8 వారాల (56 రోజులు) విండో రూల్ ప్రకారమే ‘పెద్ది’ ఓటీటీ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. సినిమా రేపు (జూన్ 4) థియేటర్లలో విడుదలవుతున్నందున.. బాక్సాఫీస్ రన్‌ను బట్టి దాదాపు జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బుచ్చిబాబు తెరకెక్కించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell