Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Peddi: 'పెద్ది పార్ట్ 2'పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!

Telugu Bell 6 days ago

Printed Date :Would possibly 18, 2026 , 8:51 am

టీవలి కాలంలో 'బాహుబలి', 'పుష్ప', 'సలార్' వంటి చిత్రాలు రెండు భాగాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ - బుచ్చిబాబుల 'పెద్ది' కూడా రెండు భాగాలుగా రానుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై వస్తున్న వార్తలకు దర్శకుడు బుచ్చిబాబు సన అఫీషియల్‌గా చెక్ పెట్టారు.

ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో 'పెద్ది పార్ట్ 2' పై వస్తున్న రూమర్స్ గురించి బుచ్చిబాబు సన చాలా స్పష్టంగా, ముక్కుసూటిగా సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 'పెద్ది కథ ఒక సారే వస్తుంది. అది కూడా కేవలం ఒక పార్ట్ (Unmarried Quantity) మాత్రమే. ఒకే కథను లాగి.. రెండు పార్ట్ ల్లో తీయడం అనేది నాకు అస్సలు నచ్చదు. ఒక కథను అనుకున్నప్పుడు దాన్ని ఒకే సినిమాలో పూర్తిగా కంప్లీట్ చేసి.. ఆ తర్వాత మరో కొత్త కథపై దృష్టి పెట్టడం నా మేకింగ్ స్టైల్. అంతే కానీ, 'పెద్ది' సినిమా కథకు పార్ట్ 2 అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ సెట్ కాదు' అని అన్నారు. డైరెక్టర్ ఇచ్చిన ఈ బోల్డ్ స్టేట్‌మెంట్‌తో 'పెద్ది' సినిమాకు ఎలాంటి సీక్వెల్స్ లేదా పార్ట్ 2లు ఉండవని, కథ మొత్తం ఒకే భాగంలో ఎండ్-టు-ఎండ్ కంప్లీట్ అయిపోతుందని స్పష్టమైపోయింది. ఒక ప్రాపర్ కంటెంట్ ఉన్న సినిమాగా పార్ట్ 1 లోనే ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి హై-వోల్టేజ్ ఎమోషన్‌ను అందించబోతున్నట్లు బుచ్చిబాబు ధీమా వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell