Dailyhunt

Peddi: పెద్ది పరుగులు.. ఎందాకా?

Telugu Bell 3 weeks ago

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఇప్పుడు ఒకటే ప్రశ్న వేధిస్తోంది… 'పెద్ది' అనుకున్న సమయానికి వస్తుందా? లేక మళ్ళీ వాయిదా పడుతుందా?

అనే. నిజానికి దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చుట్టూ ఇప్పుడు ‘వాయిదా’ గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వాయిదా పడిన ఈ సినిమాను ఏప్రిల్ 30న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టిగా నిర్ణయించుకుంది కానీ, ఇటీవల విడుదలైన లేటెస్ట్ పోస్టర్‌లో ఎక్కడా విడుదల తేదీ ప్రస్తావన లేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. సాధారణంగా రిలీజ్ డేట్ లాక్ చేసిన సినిమాలు ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌లోనూ ఆ తేదీని హైలైట్ చేస్తాయి కానీ పెద్ది విషయంలో అలా జరగకపోవడం, సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను ఇస్తోంది.

READ MORE: Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్‌కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..

ప్రస్తుతం చిత్ర యూనిట్ కాలాన్ని మించిన వేగంతో ఊరుకులు పరుగులు పెడుతూ పని చేస్తోంది. అయితే కొన్ని కీలక అడ్డంకులు టీమ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి కానీ సినిమాలో అత్యంత కీలకంగా భావిస్తున్న మాస్ నెంబర్ (ఐటమ్ సాంగ్) షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ సహా డబ్బింగ్ పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వాస్తవానికి ఏప్రిల్ 30కి సినిమా రావాలంటే ఈ పాటికే ఫస్ట్ కాపీ సిద్ధం కావాలి. కానీ ప్రస్తుత వేగం చూస్తుంటే అది అసాధ్యంగా కనిపిస్తోందని ఇండస్ట్రీ టాక్. అయితే వచ్చే రెండు మూడు రోజుల్లో పెద్ది విడుదలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏప్రిల్ 30 మిస్ అయితే, సినిమా ఏకంగా మే నెలాఖరుకు లేదా జూన్‌కు వెళ్లే ప్రమాదం ఉంది. రామ్ చరణ్ కెరీర్‌లో భారీ డిజాస్టర్ అయిన ‘గేమ్ ఛేంజర్’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో నాణ్యత కోసం కాస్త ఆలస్యమైనా పర్లేదని కొందరు అంటుంటే, పదే పదే వాయిదాలు పడితే బజ్ తగ్గుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell