Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Peddi: పెద్ది ట్రైలర్'పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్

Telugu Bell 1 week ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా..

తాజాగా ఆ అంచనాలను ఆకాశానికెత్తేస్తూ మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. సినిమా ట్రైలర్‌ను ప్రత్యేకంగా వీక్షించిన ఆయన.. తన ఎగ్జైట్‌మెంట్‌ను ఆపుకోలేక సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు, మునుపటిలాగే పక్కా ప్లానింగ్‌తో అదిరిపోయే 'చిరు లీక్స్' ఇచ్చేశారు. 'పెద్ది' ట్రైలర్ దాదాపు మూడు నిమిషాల పాటు సాగిందని, అదొక 'ప్యూర్ ఫైర్ పవర్' అని చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, బుచ్చిబాబు విజన్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఈ ముగ్గురూ తమ కెరీర్ బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చారని, అక్షరాలా రఫ్ఫాడించేశారని ఆయన కొనియాడారు. అభిమానులు తమ మదిలో ఎంత భారీగా ఊహించుకున్నా.. దానికి వంద రెట్లు మించి ఈ ట్రైలర్ ఉంటుందని చిరు గ్యారెంటీ ఇచ్చారు. సినిమాలో ఎమోషన్, గూస్‌బంప్స్ తెప్పించే ఎలివేషన్స్, యాక్షన్ మ్యాడ్‌నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయంటూ మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

చిరంజీవికి ఏదైనా కంటెంట్ బాగా నచ్చితే.. అందులోని క్రేజీ విషయాలను అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తన ట్రేడ్‌మార్క్ #ChiruLeaks ను తెరపైకి తెచ్చారు. ట్రైలర్ చూసిన ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక, అందులోని ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను లీక్ చేసి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు…” అంటూ సాగే ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ ఒక్క డైలాగ్‌తో సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్, క్రీడా నేపథ్యంలోని ఇంటెన్సిటీ, ఎమోషనల్ స్ట్రగుల్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమైపోతోంది. చివరగా.. “సారీ బుచ్చి బాబు… ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పా!” అంటూ డైరెక్టర్‌కు సరదాగా క్షమాపణలు కూడా చెప్పారు చిరు. వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి.. స్వయంగా మెగాస్టార్ ఇచ్చిన ఈ ఫీడ్‌బ్యాక్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell