Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

PEDDI POWERPLAY TOUR : 'పెద్ది' ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది

Telugu Bell 1 week ago

రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పెద్ది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రమోషన్లు భారీగా నిర్వహించబోతున్నారు.

అందుకు సంబంధించి ప్లాన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మే 18న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో స్టార్ట్ కానున్నపెద్ది ప్రమోషన్స్ అక్కడి నుండి వరుసగా దేశంలోని కీలక నగరాల్లో భారీ ఈవెంట్లను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించబోయే ఈవెంట్ టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలవబోతోందని సమాచారం.

పవర్ ప్లే టూర్ లో మే 18 ముంబైలో ఈవెంట్ నిర్వహించి అక్కడ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. మే 22 ఉప్పల్ స్టేడియంలో జారబోయే ఐపీయల్ మ్యాచ్ కు పెద్ది టీమ్ రాబోతుంది. ఆ తర్వాత మే 23 భోపాల్ లో ఈవెంట్ నిర్వహించనున్నారు. మే 24 బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించి మే 28 ఢిల్లీలో మరొక ఈవెంట్ నిర్వహించబోతున్నారు. మే 30 చెన్నై కీలక ప్రెస్ మీట్ ఉండబోతుంది. విజయనగరం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు జూన్ 01న భారీ ఈవెంట్ చేస్తున్నారు. ఫైనల్ గా జూన్ 02న హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ భారీ ప్రమోషన్ల అనంతరం జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ప్రదర్శించబడతాయి. ఇక జూన్ 4వ తేదీన ‘పెద్ది’ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఇప్పటికే ఊపేస్తోంది. ఓవర్సీస్ లో హోంబలే ఫిల్మ్స్ పంపిణీ తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell