మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది.
ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, ఈ సినిమా సుమారు 3 గంటల 2 నిమిషాల నిడివితో ఉంటుందని వెల్లడించారు.
ముఖ్యంగా ఈ చిత్రంలో చివరి 15 నిమిషాలు హైలైట్‌గా నిలవనున్నాయని, ఆ సమయంలో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాడని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాల మొత్తం క్రెడిట్ రామ్ చరణ్‌కే దక్కుతుందని ఆయన ప్రశంసించారు. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను మే 18న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
The publish 'పెద్ది' రన్ టైమ్ పై బుచ్చి బాబు క్లారిటీ..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
