గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది'. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో జరిగే ఒక ప్రత్యక్ష కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. అయితే, ఆన్ లైన్ లో చూసే అభిమానులకు మాత్రం ట్రైలర్ విడుదల ఆలస్యం కావొచ్చు. సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ విడుదల అవుతుందని అంచనాలు ఉన్నప్పటికీ, చిత్ర నిర్మాతలు ఖచ్చితమైన డిజిటల్ విడుదల సమయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ఏది ఏమైనా సినిమా పై ఉన్న భారీ హైప్‌కు మరింత ఊపునివ్వడానికి ట్రైలరే ముఖ్యం. అందుకే, అందరి దృష్టి ఇప్పుడు ట్రైలర్ విడుదలపైనే ఉంది. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
The put up 'పెద్ది' ట్రైలర్ ఆన్ లైన్ లో ఎప్పుడు వస్తోందంటే ? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
