మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. విడుదలకు కేవలం నెల రోజులే సమయం ఉండటంతో, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.
దీనిలో భాగంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ సిద్ధం చేసినట్లు సమాచారం.
త్వరలోనే విడుదల కానున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో కనిపించనున్నారని, హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు అదిరిపోయే స్పోర్ట్స్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంపై మరింత బజ్ రావాలంటే ఈ ట్రైలర్ భారీ హిట్ కావడం చాలా కీలకం.
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ మరియు జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.
The submit పెద్ది ట్రైలర్ కట్ సిద్ధం.. ఇక రికార్డులు బ్రేక్ అవడం ఖాయం..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
