Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'పెద్ది' ట్రైలర్ మ్యాడ్నెస్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

Telugu Bell 1 week ago

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హీరోయిన్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే "పెద్ది".

భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి ఇపుడు మేకర్స్ అంతకంతకూ హైప్ ఎక్కించే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ కోసమే ఇప్పుడు అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా దీనిని ముంబైలో లాంచ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇది వరకే కన్ఫర్మ్ చేశారు.

ఇక లేటెస్ట్ గా పెద్ది ట్రైలర్ మ్యాడ్నెస్ పై స్వయంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సాలిడ్ గ్లింప్స్ తో ఇప్పటివరకు పాటలు, గ్లింప్స్ లు చూసారు రేపు పెద్ది ట్రైలర్ బ్లాస్ట్ చూడబోతున్నారు అని ముంబైలో జియో వరల్డ్ డ్రైన్ దగ్గర గ్రాండ్ గా ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నట్టు క్రేజీ అప్డేట్ ని చరణ్ అందించాడు.

అలాగే ఈ ఈవెంట్ మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి మొదలు కానుంది. మరి ఈ ఈవెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు. అలాగే జూన్ 4న పాన్ ఇండియా లెవెల్లో సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

The publish 'పెద్ది' ట్రైలర్ మ్యాడ్నెస్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell