Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'పెద్ది' వారందరికీ పెద్ద దిక్కు అవుతుంది - జగపతి బాబు

Telugu Bell 3 weeks ago

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన్న 'పెద్ది' చిత్రం గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పెద్ది చిత్ర యూనిట్ పాల్గొంది. ఇక ఈ వేడుకలో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు పెద్ది మూవీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ సినిమాలో అప్పలసూరి అనే కీలక పాత్ర పోషిస్తున్న ఆయన.. 'పెద్ది' సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్స్‌కి మరియు ఎగ్జిబిటర్స్‌కి ఒక పెద్ద దిక్కు అవుతుంది.. అంటూ ధీమా వ్యక్తం చేశాడు. సంక్రాంతి సీజన్ తర్వాత సరైన కమర్షియల్ సక్సెస్ లేక థియేటర్లు మూతపడే స్థితికి చేరిన తరుణంలో, జగపతి బాబు చేసిన ఈ కామెంట్స్ ట్రేడ్ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి, ఇండస్ట్రీని మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశాడు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పీరియడ్ డ్రామాపై జగపతి బాబు చేసిన వ్యాఖ్యలతో మెగా అభిమానుల్లో అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

The submit 'పెద్ది' వారందరికీ పెద్ద దిక్కు అవుతుంది - జగపతి బాబు first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell