మన తెలుగు సినిమా దగ్గర మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరోస్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. అయితే రామ్ చరణ్ ఒక్క సాలిడ్ హిట్ కొడితే ఎలా ఉంటుందో ట్రేడ్ వర్గాలు అందరికీ తెలుసు.
ఇక ఇప్పుడు రామ్ చరణ్ తన అవైటెడ్ చిత్రం “పెద్ది” తో బాక్సాఫీస్ మీదకు రాబోతున్నాడు.
200 కోట్లకు పైగా పెద్ది థియేట్రికల్ బిజినెస్?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కలయికలో వస్తున్న పెద్ది సినిమాకి ఇపుడు ఏకంగా 200 కోట్లకి పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సినీ వర్గాల్లో ఓ టాక్ చక్కర్లు కొడుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచే 130 కోట్లకి పైగా బిజినెస్ చేస్తే ఓవర్సీస్, హిందీ, కన్నడ బిజినెస్ లు మేజర్ గా భాగం అయ్యి వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ పెద్ది సినిమాకి 210 కోట్లకు దగ్గర చేరినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
చరణ్ స్టామినా.. ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి ప్లాప్స్ ఉన్నా
మామూలుగా చాలావరకు మన స్టార్ హీరోస్ గత సినిమాల పెర్ఫామెన్స్ లు ఆధారంగా నెక్స్ట్ సినిమాలు బిజినెస్ ఉంటాయి. కానీ చరణ్ కి ఇలాంటి దారుణ పరాజయాలు ఉన్నప్పటికీ ఇంట్రెస్టింగ్ గా వాటిని మించే బిజినెస్ ని ఈ పెద్ది కి కూడా జరగడం అనేది రామ్ చరణ్ కి ఒక్క సరైన సినిమా పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో బాగా తెలిసే ఈ రేంజ్ లో బయ్యర్లు కొన్నారని చెప్పొచ్చు.
సో పెద్ది సినిమా ఈ అన్ని అంచనాలు అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ జాన్వీ కపూర్ నటించగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. అలాగే ఈ జూన్ 4న సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.
The put up 'పెద్ది': వరుసగా రెండు ప్లాప్స్.. అయినా రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా తగ్గలేదు! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
