Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

PeddiTrailer : 'పెద్ది' పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?

Telugu Bell 5 days ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చి కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్ది. ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ లోను ఎన్నో అంచనాలున్న పెద్ది ట్రైలర్ వచ్చేసింది.

మోస్ట్ అవేటెడ్ మూవీగా వస్తున్న ‘పెద్ది’ ట్రైలర్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌పై ప్రస్తుతం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ట్రైలర్ కు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా పేలవంగా ఉందని ప్రేక్షకులు ఆశించిన రేంజ్ ‘హై’ ఈ ట్రైలర్‌లో లభించలేదు. దానికి మిక్సింగ్ సరిగా కుదరలేదు. బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ డైలాగ్స్ ఏమి చెప్తున్నాడో అర్ధం కానీవిధంగా ఉంది మిక్సింగ్. ఇక దర్శకుడు బుచ్చిబాబు ఒకే ట్రైలర్‌లో ఎక్కువ సీన్స్, ఎలిమెంట్స్ చూపించాలనే తాపత్రయంలో దాన్ని ఓవర్‌స్టఫ్ చేసేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే బాలీవుడ్ మూవీ దంగల్, సుల్తాన్ ఛాయలు కనిపించడం కూడా కాస్త నెగిటివ్ అవుతోంది. సినిమాను ఎంతో సిన్సియర్ అండ్ రూటెడ్ కథగా ప్రమోట్ చేస్తుండగా ట్రైలర్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ ఆ మూడ్‌కు కాస్త భిన్నంగా అనిపించడం, దేవరలో జాన్వీ పాత్రని గుర్తుచేసినట్టు అనిపించిందని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌లో ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించే ఓపెనింగ్స్ కలెక్షన్లను నిర్ణయించడంలో ట్రైలర్లదే కీలక పాత్ర. కానీ ‘పెద్ది’ టీమ్ ఈ ట్రైలర్ కట్‌ను అంత సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపించలేదు. మొదటి రెండు సాంగ్స్ తో ఎక్కడికో వెళ్లిన ఈ సినిమా హైప్ ఆ మధ్య వచ్చిన ఇప్పుడు వచ్చిన ట్రైలర్ తో మిశ్రమ స్పందన రాబట్టింది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలను మళ్లీ పెంచడానికి ‘రిలీజ్ ట్రైలర్’ ను తీసుకువస్తారేమో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell