Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రామ్ పోతినేనితో 'హిట్' భామ.. కలిసొచ్చేనా..?

Telugu Bell 5 days ago

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అభిమానులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన కొత్త చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే కూడా రామ్ స్వయంగా అందించడం విశేషం. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోవడానికి సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా 'కేజీయఫ్' ఫేమ్, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసేందుకు చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఆమె వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాలో నటిస్తోంది. నాని సరసన 'హిట్-3' మూవీలో నటించిన శ్రీనిధి మంచి సక్సెస్ అందుకుంది. రామ్ సరసన శ్రీనిధి నటిస్తే ఈ సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని కృష్ణ పోతినేని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2026 డిసెంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

The submit రామ్ పోతినేనితో 'హిట్' భామ.. కలిసొచ్చేనా..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell