బాలీవుడ్ సినిమా నుంచి వస్తున్న అవైటెడ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ' కోసం అందరికీ తెలిసిందే. పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రామునిగా సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా విడుదలకి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఫుటేజ్ వైరల్ గా మారింది.
రణబీర్ పై ఓ యుద్ధ సన్నివేశం సీన్ వైరల్ అవుతుండగా అది చూసి అంతా షాకవుతున్నారు. అయితే అసలు దీనిపై నిజం ఏంటి అనేది తెలుస్తుంది. ఆ వైరల్ అవుతున్న ఫుటేజ్ లో ఎలాంటి నిజం లేదట. అది పూర్తిగా ఏ ఐ తో చేసింది అని ఒరిజినల్ సీన్ కూడా ఒకటి బయటకి వచ్చింది. సో అది ఫేక్ అని తేలిపోయింది. ఇక అంతా ఇప్పుడు సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూస్తుండగా దీనిని జూలై లో విడుదల చేయనున్నట్టు టాక్. ఇక ఈ సినిమాకి హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
The submit 'రామాయణ' ఫుటేజ్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్ పై నిజం! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
