Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'రామాయణ' రైట్స్.. అసలు కథ ఇదేనా..?

Telugu Bell 3 days ago

ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో 'రామాయణం' సినిమా తెరకెక్కుతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే, ఈ సినిమా హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ధర ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ఏకంగా రూ.450 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఈ హక్కులను దక్కించుకోవడానికి ప్రముఖ నిర్మాతలు, పంపిణీదారులు అయిన అనిల్ తడాని, జయంతిలాల్ గడ, కరణ్ జోహార్ గట్టిగా ప్రయత్నించారు.

కానీ, రూ.450 కోట్ల భారీ ధర వినడంతో ప్రస్తుతం వీరంతా వెనకడుగు వేస్తున్నారు. ఇటీవలే షారుఖ్ ఖాన్ నెక్స్ట్ సినిమా ‘కింగ్’ థియేట్రికల్ హక్కులను పెన్ మరుధర్ సంస్థ రూ.250 కోట్లకు సొంతం చేసుకోగా, దాంతో పోలిస్తే రామాయణం బిజినెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. ఈ ధరను కాస్త తగ్గించి, రీజనబుల్‌గా ఉండేలా చూడాలని డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతను కోరుతున్నారట.

The publish 'రామాయణ' రైట్స్.. అసలు కథ ఇదేనా..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell